బీహార్‌లోని గోపాల్‌గంజ్‌లో షాకింగ్ ఘటన జరిగింది. మట్టి పొయ్యిలు తయారుచేసే ఒక వ్యక్తి ఇంట్లో పోలీసులు జరిపిన సోదాల్లో కోటి రూపాయల నగదు పట్టుబడింది. ఎన్నికలకు ముందు జరిగిన ఈ దాడిలో, నోట్లను లెక్కించడానికి యంత్రాన్ని తెప్పించాల్సి వచ్చింది. పోలీసులు ఆ నగదుతో పాటు అనేక బ్యాంక్ పాస్‌బుక్‌లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇంత పెద్ద మొత్తంలో నగదు దొరకడంపై దర్యాప్తు జరుగుతోంది.