జమ్మూకశ్మీర్‌ వైద్య కళాశాలలో బురఖా వివాదం.. లేబర్ రూమ్‌లోకి నో ఎంట్రీ!

43చూసినవారు
జమ్మూకశ్మీర్‌ వైద్య కళాశాలలో బురఖా వివాదం.. లేబర్ రూమ్‌లోకి నో ఎంట్రీ!
జమ్మూకశ్మీర్‌లోని దోడా ప్రభుత్వ వైద్య కళాశాలలో బురఖా ధరించిన నర్సింగ్ విద్యార్థినులను లేబర్ రూమ్‌లోకి అనుమతించకపోవడంతో వివాదం చెలరేగింది. తమను అడ్డుకుని, మత విశ్వాసాలను కించపరిచారని విద్యార్థులు విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. ఇన్ఫెక్షన్ల నివారణ నిబంధనల ప్రకారమే హాస్పిటల్ గౌను ధరించాలని సూచించినట్లు సూపరింటెండెంట్ తెలిపారు. ఈ వివాదంపై స్పష్టత కోసం ఏడుగురు సభ్యుల విచారణ కమిటీని ఏర్పాటు చేశారు, నివేదిక 2 రోజుల్లో రానుంది.

సంబంధిత పోస్ట్