బస్సు ప్రమాదం.. మృతుల్లో 13 మంది తాండూరు వాసులే

56చూసినవారు
బస్సు ప్రమాదం.. మృతుల్లో 13 మంది తాండూరు వాసులే
TG: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో సోమవారం ఉదయం తాండూరు నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్‌ ఢీ కొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో తాండూరు ప్రాంతానికి చెందిన 13 మంది ప్రయాణికులు దుర్మరణం చెందారు. బస్సులో సుమారు 70 మంది ప్రయాణికులు, వీరిలో ఎక్కువగా విద్యార్థులు, ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 19 మంది మృతి చెందినట్లు అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్ అధికారకంగా వెల్లడించారు.