బస్సు ప్రమాదం.. తండ్రి, కూతురు సజీవ దహనం

30638చూసినవారు
బస్సు ప్రమాదం..  తండ్రి, కూతురు సజీవ దహనం
రాజస్థాన్‌లోని జైపూర్‌ జిల్లా మనోహర్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం మంటల్లో దగ్ధమైన బస్సు ప్రమాద ఘటన పలు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. వలస కూలీలతో వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు హైటెన్షన్ విద్యుత్ తీగకు తగలడంతో ఈ భారీ అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో యూపీలోని పిలిభిత్‌కు చెందిన కూలీ నసీమ్ (50), అతని కూతురు సాహినమ్ (20) సజీవ దహనం అయ్యారు. మరో 10 మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు.

సంబంధిత పోస్ట్