
భారత్- రష్యా మధ్య స్వేచ్ఛా వాణిజ్య జోన్ ను ఏర్పాటు చేస్తాం: పుతిన్
భారత్- రష్యా మధ్య స్వేచ్ఛా వాణిజ్య జోన్‌ను ఏర్పాటు చేస్తామని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు. భారత్ పర్యటన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. 'మోడీతో చర్చలు ఫలప్రదమయ్యాయి. భారత ఇంధన రంగ అభివృద్ధికి కావాల్సిన చమురు, గ్యాస్, బొగ్గు అంశాల్లో సహకారానికి సిద్ధం. ఆర్థిక, భద్రత తదితర కీలక అంశాలపై ఒప్పందాలకు చర్చలు జరుపుతాం. నాకు అపూర్వ స్వాగతం పలికిన భారతీయులందరికీ, ప్రధానికి ప్రత్యేక కృతజ్ఞతలు' అని అన్నారు.




