బస్సు ప్రమాదం.. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ప్రకటన

43చూసినవారు
బస్సు ప్రమాదం.. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ప్రకటన
TG: వికారాబాద్‌ జిల్లా అనంతగిరి వద్ద జరిగిన బస్సు ప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఈ మేరకు క్షతగాత్రులను మంత్రి శ్రీధర్‌బాబు పరామర్శించారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి లక్ష రూపాయల చొప్పున మంత్రి పరిహారం ప్రకటించారు. ప్రమాదానికి గురైన ట్రావెల్స్‌ యాజమాన్యంతోపాటు డ్రైవర్‌పై కేసు నమోదైనట్లు తెలిపారు. పూర్తి వివరాలు సేకరించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్