AP: విశాఖలోని శ్రీనగర్ వద్ద ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుల్లో ఓ డ్రైవర్, ఇద్దరు విజయనగరం జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. దాదిపిల్లి రాంబాబు (55), లంక ఈశ్వరం (57)గా గుర్తించారు. గాయపడిన 10 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. టైరు పంక్చర్ కావడంతో ఆగి ఉన్న లారీని బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు సగ భాగం పూర్తిగా ధ్వంసమైంది.