కేరళలోని పతనంతిట్ట జిల్లా కొన్నీ పట్టణంలో గురువారం ఉదయం షాకింగ్ ఘటన జరిగింది. KSRTC డిపోలో బస్సుకు డ్రైవర్ హ్యాండ్ బ్రేక్ వేయలేదు. దీంతో బస్సు డిపో నుంచి దానంతట అదే బయటకు వెళ్లి రోడ్డుకు అవతలి వైపు ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. కొంత మంది వాహనదారులు, పాదచారులు ఆఖరి నిమిషంలో బస్సును గమనించి పక్కకు తప్పుకున్నారు. బస్సులో ప్రయాణికులు ఎవరూ లేరు. దీంతో ప్రాణాపాయం తప్పింది.