మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పూణెలోని పింపిరి-చించ్వాడ్ ప్రాంతంలో సోమవారం రాత్రి వాకడ్ వంతెన వైపు వెళ్తున్న బస్సు షావ్జీ చౌక్ సమీపంలో ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించగా, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టమ్ కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.