అదుపు తప్పి ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు.. ఒకరు మృతి(వీడియో)

16539చూసినవారు
TG: మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ పెళ్లి బృందం బస్సు అదుపు తప్పి రోడ్డు వెంబడి ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లింది. ఖమ్మం-వరంగల్ ప్రధాన రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బస్ డ్రైవర్ స్పాట్ లోనే మృతి చెందాడు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే క్షతగాత్రులను బయటకు తీసి స్థానిక ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్