30 అడుగుల లోతున్న నదిలోకి దూసుకెళ్లిన బస్సు.. 17 మందికి గాయాలు (VIDEO)

7297చూసినవారు
తమిళనాడులోని తెన్‌కాశి జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెన్‌కాశి నుంచి తిరునెల్వేలి వైపు వెళ్తున్న 32 మంది ప్రయాణికులతో కూడిన TNSTC బస్సు అదుపుతప్పి, రోడ్డు పక్కనే ఉన్న అళుదకన్ని నదిలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ఘటనలో 17 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. బస్సు డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉండటంతో అతన్ని తిరునెల్వేలి ఆసుపత్రికి తరలించారు. మిగిలిన క్షతగాత్రులకు తెన్‌కాశి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్