రన్నింగ్ లో ఊడిన బస్సు టైరు..తప్పిన ప్రమాదం

15చూసినవారు
TG : మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ కేంద్రంలో బుధవారం ఒక ఘోర ప్రమాదం తప్పింది. వరంగల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వరంగల్ నుంచి ఖమ్మం వెళ్తుండగా, లక్కీ గ్రాండ్ రెస్టారెంట్ సమీపంలో రన్నింగ్‌లో ఉండగానే వెనుక చక్రం ఊడిపోయింది. ఆ ఊడిపోయిన చక్రం పక్కన వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి సుమారు 500 మీటర్ల దూరం వెళ్లి పడింది. ఈ ఘటనలో బైక్ వెనుక భాగం పూర్తిగా దెబ్బతిన్నప్పటికీ, బైక్‌పై ఉన్న వారికి ఎలాంటి గాయాలు కాలేదు. ఘటన సమయంలో బస్సులో 21 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. అధికారులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్