కసాయి తండ్రి.. కన్న బిడ్డలనే చంపేందుకు యత్నం (వీడియో)

22చూసినవారు
TG: ఓ కసాయి తండ్రి కన్న బిడ్డలనే కడతేర్చేందుకు యత్నించాడు. ఈ దారుణ ఘటన కరీంనగర్ జిల్లా వావిలాల పల్లిలో జరిగింది. మానసిక వైకల్యంతో బాధపడుతున్న కొడుకు అశ్రిత్(17), కూతురు అర్చన(15)ను గొంతు నులిమి చంపేందుకు తండ్రి మల్లేశం ప్రయత్నించాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ కూతురు మృతి చెందింది. కొడుకు పరిస్థితి విషమంగా ఉంది. దీంతో తండ్రి మల్లేశం పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్