
నందిగామ వద్ద లారీని ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు (VIDEO)
AP: ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తున్న ట్రావెల్స్ బస్సు ముందుండే లారీని ఢీకొట్టగా, బస్సులో ఉన్న 20 మందిలో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.




