TG: సీఎం రేవంత్ అధ్యక్షతన గురువారం సాయంత్రం 4 గంటలకు కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో HYD తరహాలో నిజామాబాద్, నల్గొండ, వరంగల్, కరీంనగర్లో అల్పాదాయ కుటుంబాలకు ఇందిరమ్మ టవర్ల నిర్మాణంపై నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. హౌసింగ్ బోర్డు స్థలాల్లో G+ 5 టవర్లు నిర్మించి, నియోజకవర్గానికి 480 మంది లబ్ధిదారులకు కేటాయించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించిన విధివిధానాలు, అర్హతలపై చర్చించి నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది.