కాసేపట్లో ప్రారంభం కానున్న కేబినెట్ సమావేశం

0చూసినవారు
కాసేపట్లో ప్రారంభం కానున్న కేబినెట్ సమావేశం
సీఎం రేవంత్ అధ్యక్షతన కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. తొలిసారి పేపర్ రహితంగా నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో వీబీ జీ రామ్‌జీ పథకం అమలుపై నిర్ణయం తీసుకోనున్నారు. ఖరీఫ్ సీజన్‌లో విత్తనాలు, ఎరువుల పంపిణీపై కీలక చర్చ జరగనుంది. ఎల్‌నినో పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలు, ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సాహకాలు ఇవ్వడంపై చర్చించే అవకాశం ఉంది. మూసీ తొలిదశ పనులకు ఆమోదం, మెట్రో విస్తరణపైనా చర్చించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్