TG: ఆదాయ వనరుల సమీకరణపై భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలోని కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. హిల్ట్ పాలసీలో అభ్యంతరాలు లేని ఇండస్ట్రియల్ పార్కుల్లో దరఖాస్తులు క్లియర్ చేయాలని భట్టి సూచించారు. పర్యాటక రంగంలో భారీ పెట్టుబడులు ఆకర్షించేలా ప్రాజెక్టులు సిద్ధం చేయాలని ఆదేశించారు. గ్లోబల్ సమ్మిట్‌లో ప్రదర్శించేందుకు 80 పర్యాటక డీపీఆర్‌లు సిద్ధం చేయాలని నిర్దేశించారు. టైగర్ టూరిజం కార్యక్రమాలను వెంటనే ప్రారంభించాలని మంత్రులు సూచించారు.