మూసీ ప్రాజెక్టుపై కేబినెట్ సబ్ కమిటీ సమీక్ష

11చూసినవారు
మూసీ ప్రాజెక్టుపై కేబినెట్ సబ్ కమిటీ సమీక్ష
TG: మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై మంత్రులు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్‌లతో కూడిన కేబినెట్ సబ్ కమిటీ సమీక్ష నిర్వహించింది. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. మూసీ పునరుజ్జీవ పనులు పూర్తిగా ప్రజాస్వామ్య పద్ధతిలో, పారదర్శకంగా కొనసాగుతాయని తెలిపారు. ఈ ప్రాజెక్టులో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు నేటి నుండి ఏప్రిల్ 15 వరకు ఆన్‌లైన్ ద్వారా అభిప్రాయాల సేకరణ చేపడుతున్నామని భట్టి చెప్పారు. ప్రజలు తమ సూచనలను musirrdc@gmail.com మెయిల్ ఐడీకి పంపించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్