
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
TG: ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. అనుమానస్పద స్థితిలో మహిళ మృతి చెందింది. నాచారం కార్తికేయ నగర్‌కు చెందిన లక్ష్మీనరసయ్య, బాల లక్ష్మి దంపతుల కుమార్తె హర్షిణి(43)కి ఉప్పల్ ధర్మపురి కాలనీకి చెందిన వెంకటరమణతో 2005లో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు సంతానం. భర్త వెంకటరమణ, అత్తమామల వేధింపులతోనే తమ కూతురు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుందని ఆరోపిస్తూ మృతురాలి కుటుంబ సభ్యులు ఉప్పల్ PSలో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




