
ఐఎంఏ నుంచి తొలి మహిళా ఆఫీసర్: సాయి జాధవ్ అరుదైన రికార్డు
భారత సైనిక చరిత్రలో చరిత్రాత్మక ఘటన చోటు చేసుకుంది. డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలిటరీ అకాడమీ (ఐఎంఏ) నుంచి తొలిసారిగా సాయి జాధవ్ (23) అనే మహిళా ఆఫీసర్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని, టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్‌గా నియమితులయ్యారు. 93 ఏళ్ల ఐఎంఏ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఆఫీసర్ క్యాడెట్‌గా శిక్షణ పూర్తి చేసుకున్న సాయి జాధవ్‌ను అందరూ అభినందిస్తున్నారు. 1932లో ఐఎంఏ స్థాపించినప్పటి నుంచి 67 వేల మంది కంటే ఎక్కువ మంది ఆఫీసర్ క్యాడెట్లు పాస్ కాగా, వారిలో ఇప్పటి వరకు మహిళలు లేరు.




