
అమెరికా కోర్టులో అదానీకి ఊరట
ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీకి అమెరికా కోర్టులో ఊరట లభించింది. తమపై యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (SEC) నమోదు చేసిన ఫ్రాడ్ కేసును కొట్టివేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపేందుకు న్యూయార్క్‌లోని ఫెడరల్ కోర్టు అంగీకరించింది. ఈ కేసు అమెరికా చట్టాల పరిధిలోకి రాదని, ఇది పూర్తిగా దేశం వెలుపల జరిగిన వ్యవహారమని అదానీ తరఫు న్యాయవాదులు వాదిస్తున్నారు.




