TG: రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగిన బస్సు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. వికారాబాద్ జిల్లా యాలాల్ మండలం లక్ష్మీనారాయణపూర్లో నివాసముంటున్న గుర్రాల శ్రీనివాస్ రెడ్డి కుమార్తె అఖిలారెడ్డి మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె గచ్చిబౌలిలోని ఒక ప్రైవేట్ కళాశాలలో ఎంబీఏ చదువుతున్నారు. అయితే కొత్త ఫోన్ కొన్నానని వచ్చి తీసుకెళ్లమంటూ తల్లి అలివేలు ఆమెకు ఫోన్ చేయడంతో అఖిలా HYD నుంచి శనివారం ఇంటికి వెళ్లారు. కొత్త ఫోన్ తీసుకుని సోమవారం హైదరాబాద్ వెళ్తుండగా మార్గంమధ్యలోనే కన్నుమూశారు.