లడ్డూ ఇలాక్కూడా ఉంటుందా.. క్రియేటివిటీ పీక్స్ (వీడియో)

6111చూసినవారు
భారతీయ వంటకాలకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. ఆస్ట్రేలియాలోని ఓ రెస్టారెంట్ లడ్డూ పిండిని ఐస్‌క్రీమ్ వలె సాఫ్ట్‌సర్వ్ రూపంలో అందించడం ప్రారంభించింది. మిగిలిపోయిన లడ్డూ పిండితో ఈ కొత్త ప్రయోగాన్ని చేసినట్లు రెస్టారెంట్ మహిళ వివరించారు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కొందరు దీనిని మెచ్చుకోగా, మరికొందరు పాత పద్ధతిలోనే లడ్డూ తినడానికి ఇష్టపడతామని అన్నారు. ఈ వినూత్న ప్రయోగం ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.

సంబంధిత పోస్ట్