కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేయగలరా?: తలసాని

8చూసినవారు
TG: కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేయాలని సీఎం రేవంత్ చూస్తున్నారని మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. 'సెక్రటేరియట్, 125 అడుగుల బీఆర్ అంబేద్కర్ విగ్రహం ఎవరు కట్టారు? మీరు కూర్చుంటున్న పోలీస్ కమాండ్ కంట్రోల్ రూం ఎవరు కట్టారు? ప్రజాభవన్ అని పిలుస్తున్న ప్రగతి భవన్ ఎవరు కట్టారు? ఒక రాష్ట్రాన్ని సాధించి భారతదేశ చిత్రపటంలో పెట్టింది ఎవరూ.. కేసీఆర్ కదా?' అని అన్నారు. మరి ఆయన ఆనవాళ్లు ఎలా తీసేయగలరు? అని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్