
డీజీపీ బి.శివధర్ రెడ్డిని కలిసిన నాగార్జున
హైదరాబాద్‌లోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో సినీనటుడు అక్కినేని నాగార్జున గురువారం తెలంగాణ నూతన డీజీపీ శివధర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన శివధర్ రెడ్డి ఇంటెలిజెన్స్ డీజీగా కూడా సేవలందించారు. 2014-2016 మధ్య తెలంగాణ రాష్ట్రానికి మొదటి ఇంటలిజెన్స్ చీఫ్‌గా శివధర్‌రెడ్డి పనిచేశారు. 2016 లో జరిగిన గ్యాంగ్‌స్టర్ నయీం ఎన్కౌంటర్ ఆపరేషన్‌లో కీలకంగా వ్యవహరించి, గుర్తింపు పొందారు.




