ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ జిల్లాలో రేబీస్ బాధిత ఆవు మరణంతో ఒక గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. కారణమేమిటంటే ఆ ఆవు పాలను మతపరమైన పూజలో పంచామృతం తయారికి ఉపయోగించడం. దాదాపు 200 మంది ఆ పంచామృతాన్ని సేవించడంతో, భద్రత పరంగా ఆరోగ్య శాఖ అధికారులు అందరికీ యాంటీ–రేబీస్ టీకాలు వేసుకోవాలని సూచించారు. మూడు నెలల క్రితం రేబీస్ సోకిన ఒక వీధి కుక్క ఆ ఆవును కరిచిన విషయం బయటపడటంతో ఆందోళన పెరిగింది.