
మా క్యాంపస్‌పై బాంబులు వేయండి: విద్యార్థిని
తమ క్యాంపస్‌పై బాంబులు వేయాలంటూ అమెరికాకు చెందిన విద్యార్థిని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు వాట్సప్ ద్వారా సందేశం పంపారు. అయితే ఆ మెసేజ్‌ను తాను జోక్‌గా పంపినట్లు తెలిపినప్పటికీ పోలీసులు దానిని సీరియస్‌గా పరిగణించి అరెస్ట్ చేశారు. ఫ్లోరిడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీకి చెందిన 23 ఏళ్ల గాబ్రియేలా సల్దానా వాట్సప్ గ్రూపులో నెతన్యాహుకు సందేశాన్ని పంపింది. నెతన్యాహుకు తన మాటలు వినిపిస్తే.. క్యాంపస్‌పై బాంబు వేయాలని మెసేజ్ పంపారు.




