యూపీలో 2.89 కోట్ల ఓట్లు తొలగింపు

9206చూసినవారు
యూపీలో 2.89 కోట్ల ఓట్లు తొలగింపు
యూపీలో తాజాగా విడుదలైన ముసాయిదా ఓటర్ల జాబితాలో 2.89 కోట్ల ఓట్లు తొలగించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 18.7 శాతం తగ్గింది. తొలగించిన వారిలో 2.17 కోట్లు వలస వెళ్లినవారు, 46.23 లక్షలు మరణించినవారు, 25.47 లక్షలు రెండు చోట్ల ఓట్లు ఉన్నవారు ఉన్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. లఖ్‌నవూలో అత్యధికంగా 30 శాతం ఓట్లు తగ్గాయి. జనవరి 6 నుంచి ఫిబ్రవరి 6 వరకు క్లెయిమ్‌లు, అభ్యంతరాలు స్వీకరిస్తారు. తుది జాబితా మార్చి 6న విడుదలవుతుంది.

సంబంధిత పోస్ట్