TG: రాష్ట్రంలో క్యాన్సర్ వైద్య సేవలను మరింత విస్తృతం చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. క్యాన్సర్ రోగుల కోసం 33 జిల్లాల్లో డే కేర్ సెంటర్లను ఏర్పాటు చేసి, అక్కడే కీమోథెరపీ సేవలు అందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. క్యాన్సర్ సేవలను బలోపేతం చేసే దిశగా రీజినల్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. రోగులు సాధారణ కీమోథెరపీ కోసం హైదరాబాద్ రావాల్సిన అవసరం లేకుండా, వారి సొంత జిల్లాల్లోనే చికిత్స పొందేలా అధికారులను మ్యాపింగ్ చేయాలని ఆయన ఆదేశించారు.