
పారిశుధ్య కార్మికులను ఢీకొట్టిన కారు(వీడియో)
TG: మేడ్చల్ జిల్లా జవహర్ నగర్లో షాకింగ్ యాక్సిడెంట్ జరిగింది. మంగళవారం తెల్లవారుజామున ఇద్దరు పారిశుధ్య కార్మికులు రవి, ప్రమోద్‌లు విధి నిర్వహణలో ఉన్నారు. ఈ క్రమంలో వేగంగా వచ్చిన ఓ కారు వారిని ఢీకొట్టింది. వేగంగా వచ్చి కారు చెట్టును ఢీకొని వీరిపై ఎగిరి పడింది. ఈ ప్రమాద దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. కాగా ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయాలు కాగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.




