బీజేపీ బీ ఫామ్ తో పోటీ చేస్తున్న అభ్యర్థి బీఆర్ఎస్‌లో చేరిక

30చూసినవారు
బీజేపీ బీ ఫామ్ తో పోటీ చేస్తున్న అభ్యర్థి బీఆర్ఎస్‌లో చేరిక
TG: హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీలో బీజేపీకి అభ్యర్థి షాక్‌ ఇచ్చారు. బీజేపీ బీ ఫామ్ తో పోటీ చేస్తున్న అభ్యర్థి బోడెడ్ల సుష్మ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సుష్మ 14వ వార్డు నుంచి బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. అయితే ఇవాళ సుష్మ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు. సుష్మ పార్టీ మారడంతో బీజేపీ నేతలు అయోమయంలో ఉన్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్