TG: రాబోయే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక పూర్తిగా శాస్త్రీయంగా నిర్వహించే సర్వేల ఆధారంగానే ఉంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గెలిచే వారికే బీ-ఫామ్లు అందజేస్తామని ఆయన అన్నారు. వర్ధన్నపేటలో మంత్రి మాట్లాడుతూ.. నాయకులు భేషజాలకు పోకుండా కాంగ్రెస్ గెలుపు కోసం ఐక్యంగా కృషి చేయాలని సూచించారు. టికెట్ రాని వారు నిరాశ చెందవద్దని, పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు ఉంటుందన్నారు.