
ఆసియా కప్ ట్రోఫీని యూఏఈ క్రికెట్ బోర్డుకు అప్పగింత..?
ఆసియా కప్ ఫైనల్లో భారత్ విజయం సాధించిన ట్రోఫీ ప్రెజెంటేషన్ చుట్టూ వివాదం నెలకొంది. బీసీసీఐ హెచ్చరికలతో ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు మోహ్సిన్ నఖ్వీ ట్రోఫీని యూఏఈ క్రికెట్ బోర్డుకు అప్పగించినట్లు సమాచారం. భారత్కు ట్రోఫీ ఎప్పుడు అందుతుందనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. నఖ్వీ వ్యవహారం హద్దులు దాటిందని ఏసీసీ అధ్యక్ష పదవి నుంచి ఆయనను తొలగించడానికి బీసీసీఐ చర్యలు ప్రారంభించినట్లుగా తెలుస్తుంది.




