అజిత్ అగార్కర్ చీఫ్ సెలెక్టర్‌గా ఉన్న సమయంలో బీసీసీఐతో పలు అంశాల్లో విభేదాలు తలెత్తినట్లు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. 2023లో ఐర్లాండ్ పర్యటనకు
టీ20 కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్‌ను ఎంపిక చేయాలని అగార్కర్ పట్టుబట్టగా.. బీసీసీఐ మాత్రం జస్‌ప్రీత్ బుమ్రాకు బాధ్యతలు అప్పగించాలని కోరినట్లు సమాచారం. ఆ తర్వాత రోహిత్ శర్మ భవిష్యత్తుపైనా అభిప్రాయ భేదాలు వచ్చినట్లు కథనాలు వచ్చాయి. 2027 వన్డే ప్రపంచకప్ ప్రణాళికల్లో రోహిత్‌ను కొనసాగించడంపై అగార్కర్ ఆసక్తిగా లేరనే ప్రచారం జరిగింది. అందువల్లే విభేదాలని టాక్ వచ్చింది.