ముంబైలోని ఘాట్కోపర్‌లో కియా కారు బీభత్సం సృష్టించింది. శనివారం ఉదయం 6.30గంటలకు ఓ కారు అతివేగంగా బారికేడ్‌ను ఢీకొట్టి ఫుట్‌పాత్‌ను దాటుకుని షాపుల మెట్లపైకి దూసుకెళ్లింది. ఒక షాపు గోడను ఢీకొట్టిన తర్వాత ఆ కారు ఆగింది. ఈ ప్రమాదంలో కారులోని ముగ్గురు వ్యక్తులకు గాయాలు అయ్యాయి. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని కేసు నమోదు చేశారు. కారులోని వారు మద్యం తాగినట్లు గుర్తించారు.