
మారియా మచాడో నోబెల్ బహుమతి ట్రంప్‌కు.. నోబెల్ కమిటీ స్పష్టత
వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మారియా కోరినా మచాడో తన అవార్డును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఇవ్వాలనుకుంటున్నట్లు చేసిన వ్యాఖ్యలపై నార్వేజియన్ నోబెల్ కమిటీ స్పందించింది. నోబెల్ బహుమతిని మరొకరికి బదిలీ చేయడం, పంచుకోవడం రద్దు చేయడం సాధ్యం కాదని కమిటీ తేల్చి చెప్పింది. ఒకసారి నిర్ణయం ప్రకటించిన తర్వాత అది శాశ్వతంగా ఉంటుందని, నిబంధనల ప్రకారం అవార్డు గ్రహీత తన గౌరవాన్ని వేరొకరికి అధికారికంగా బదిలీ చేసే అవకాశం ఉండదని స్పష్టం చేసింది.




