అమెరికా ఇల్లినాయిస్ రాష్ట్రంలోని నేపర్‌విల్లేలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న టెస్లా కారు అకస్మాత్తుగా నియంత్రణ కోల్పోయి రోడ్డుపక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే కారులో మంటలు చెలరేగి క్షణాల్లోనే పూర్తిగా దగ్ధమైంది. ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.