హైదరాబాద్- బెంగళూరు హైవేపై కారులో మంటలు

11చూసినవారు
హైదరాబాద్- బెంగళూరు హైవేపై కారులో మంటలు
TG: హైదరాబాద్ - బెంగళూరు జాతీయ రహదారిపై శంషాబాద్ వద్ద కారులో భారీగా మంటలు చెలరేగి, పూర్తిగా దగ్ధమైంది. కారులో మంటలను గమనించిన డ్రైవర్ వెంటనే రోడ్డు పక్కన ఆపి కిందకు దిగడంతో పెను ప్రమాదం తప్పింది. ఆర్జీఐఏ పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ లేదా ఇంజన్ వేడెక్కడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్