యూపీలోని హాపూర్‌లో సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి - 9పై ఉన్న రాజా జీ హవేలీ హోటల్‌పై వేగంగా వస్తున్న కారు హోటల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందారు. ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి తన స్నేహితురాలి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికి హోటల్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ కావడంతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.