తమిళనాడులోని ఊటీలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన ఓ కారు అదుపుతప్పి గాల్లోకి ఎగిరిపడింది. రోడ్డుపై వేగంగా వెళ్తుండగా ఓ పెట్రోల్ పంపు వద్ద కారు కంట్రోల్ తప్పింది. పక్కన గ్రిల్స్ ను ఢీకొట్టి పైనుంచి కింది రోడ్డుపై పడింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.