AP: చిత్తూరు జిల్లా గంగవరం మండలంలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వైఎస్సార్ జంక్షన్ వద్ద కంటైనర్‌ను వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. బెంగళూరు నుంచి తిరుపతి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం. మృతులు కర్ణాటక వాసులుగా గుర్తించారు.