లారీని ఢీకొట్టిన కారు.. ఇద్దరికి తీవ్రగాయాలు (వీడియో)

1165చూసినవారు
TG: హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సూర్యాపేట జిల్లాకు చెందిన ధరావవత్ అశోక్ నడుపుతున్న కారు, చిత్ర లేఅవుట్ సమీపంలో రోడ్డు పక్కన ఆగివున్న లారీని వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు పూర్తిగా ధ్వంసమైంది. కారులో ఉన్న అశోక్‌తో పాటు సరూర్‌నగర్‌కు చెందిన బొర్రా మధు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని, క్షతగాత్రులను కామినేని ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్