TG: హైదరాబాద్‌లోని మెహదీపట్నం బస్ స్టాప్ సమీపంలో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికుల కోసం ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఓ కారు వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ఇంజిన్ భాగం పూర్తిగా బస్సు కిందకు దూసుకెళ్లడంతో కారు నుజ్జునుజ్జయింది. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.