VIDEO: స్కూటర్‌ను ఢీకొట్టిన కారు.. మహిళా లాయర్ మృతి

128చూసినవారు
ముంబైలోని మలాడ్ వెస్ట్‌లో వేగంగా వచ్చిన కారు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రియాంక అనే మహిళా లాయర్ మృతి చెందగా, ఆమె భర్త మయాంక్ తీవ్రంగా గాయపడ్డారు. సిగ్నల్ వద్ద ఆగి ఉన్న వీరి స్కూటర్‌ను ఓ కారు ఢీకొట్టి, ఆపై మరో మూడు ఆటోలను కూడా ఢీకొనడంతో పలువురు గాయపడ్డారు. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, నిందితుడికి పోలీసు స్టేషన్‌లో ప్రత్యేక సదుపాయాలు కల్పించారని మృతురాలి బంధువులు ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్