కారు ఢీ.. గాల్లోకి ఎగిరి పడ్డారు (వీడియో)

21చూసినవారు
యూపీలోని ఝాన్సీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్కూటీపై వెళ్తున్న ఇద్దరు యువకులను ఒక కారు ప్రమాదవశాత్తు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో స్కూటీపై ఉన్న ఇద్దరు వ్యక్తులు గాల్లోకి ఎగిరిపడ్డారు. ఇద్దరు స్వల్పంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఈ ఘటన నవంబర్ 13న జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ భయంకరమైన ప్రమాద దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ కావడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్