AP: గుంటూరు జిల్లా తాడికొండ దగ్గర ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని తప్పించబోయి రోడ్డు పక్కన ఉన్న చెట్టును కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతులు తళ్లూరుకి చెందిన బాకీ అఖిల్ (19), కంతేటి తరుణ్ (17)గా గుర్తించారు. కొడుకు అఖిల్ మృతితో తండ్రి వాసుకు గుండెపోటు వచ్చింది.