TG: నల్గొండ జిల్లా, చిట్యాల మండలం గుండ్రాంపల్లి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఇన్నోవా కారు డివైడర్‌ను ఢీకొట్టి పల్టీ కొట్టింది. దీంతో కారులో మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో కారు మంటల్లో పూర్తిగా కాలి బూడిదైంది. సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పారు. కారులో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదం వల్ల హైవేపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.