పల్టీ కొట్టిన కారు.. కానిస్టేబుల్ మృతి

10చూసినవారు
పల్టీ కొట్టిన కారు.. కానిస్టేబుల్ మృతి
TG: ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కానిస్టేబుల్ జస్వంత్(36) హైదరాబాద్ నుండి కుటుంబంతో కలిసి ఏపీలోని అన్నవరంకు వెళ్లారు. తిరిగి వస్తుండగా ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలోని గ్రీన్ ఫీల్డ్ హైవేపై కారు ఐరన్ రెయిలింగ్‌ను ఢీకొని పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో జస్వంత్ అక్కడికక్కడే మృతి చెందగా.. అతని భార్య, కూతురు, కుమారుడు ప్రాణాలతో బయటపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్