లోయలోకి దూసుకెళ్లిన కారు.. నలుగురికి తీవ్ర గాయాలు

8చూసినవారు
AP: పోలవరం జిల్లా చింతూరు మండలం పొల్లూరు జలపాతం సమీపంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. విజయవాడకు చెందిన నలుగురు యువకులు ప్రయాణిస్తున్న కారు 150 అడుగుల లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పుష్ప బ్రిడ్జికి వెళ్లి తిరిగి వస్తుండగా కారు అదుపుతప్పి లోయలో పడింది. మోతుగూడెం ఎస్ఐ అబ్దుల్ నాసిర్ హుస్సేన్, పోలీసులు తాళ్ళ సహాయంతో క్షతగాత్రులను లోయలోంచి బయటకు తీశారు. గాయపడిన వారిని మొదట చింతూరు ప్రభుత్వ ఆసుపత్రికి, ఆపై మెరుగైన వైద్యం కోసం భద్రాచలం ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్