TG: కరీంనగర్ ఆదర్శనగర్ బోర్డు వద్ద రాత్రి 2 గంటల సమయంలో విధుల్లో ఉన్న త్రీటౌన్ బ్లూకోల్ట్ కానిస్టేబుళ్లను ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్ రత్నంకు కాలు ఫ్రాక్చర్‌తో పాటు తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయనకు ప్రైవేట్ ఆసుపత్రిలో మెరుగైన చికిత్స అందిస్తున్నారు. స్వల్పంగా గాయపడిన కానిస్టేబుల్ శివకు చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేశారు. ప్రమాదానికి కారణమైన కారుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.